ఓ నెటిజ‌న్ కు దిమ్మ‌తిరిగే కామెంట్ పెట్టిన జొమాటో

ఓ నెటిజ‌న్ కు దిమ్మ‌తిరిగే కామెంట్ పెట్టిన జొమాటో

0
90

ఇప్పుడు కొందరు ఎలాంటి ప‌నిలేక ప‌నిచేసే వారిని కూడా విమ‌ర్శిస్తున్నారు.. ఏ ప‌ని చేయ‌కుండా ఖాళీగా లైకులు కామెంట్లు పెట్టే బ్యాచ్ లు ఉంటున్నాయి, స‌ర్వీస్ చేసే వాళ్ల‌పై కామెంట్లు చేస్తున్నారు ఇంకొంద‌రు, తాజాగా జొమాటో ఓ ప‌నికి మాలింది అంటూ ట్వీట్ చేశాడు ఓ వ్య‌క్తి.

దీంతో కంపెనీ చాలా వెరైటీగా స‌మాధానం ఇచ్చింది. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఈ ట్వీట్ స‌మాధానం వైర‌ల్ అయింది. ఇంత‌కీ అత‌ని ట్వీట్ ఏమిటి అంటే? లాక్‌డౌన్‌ లో నిత్యం ఫోన్‌తో ఆడుకుంటున్న నన్ను చూసి.. జోమాటో మాదిరిగా నేను కూడా ఎందుకు పనికిరానని నా తల్లిదండ్రులు భావిస్తున్నారు. వారు తెలివైన వారుఅంటూ ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

వెంటనే దీనిపై జొమాటో స్పందించింది, మేము ప్ర‌స్తుతం కిరాణా సామాగ్రీ పంపిణీ చేస్తున్నాం అని స‌మాధానం ఇచ్చింది, దీంతో ఇది స‌రైన స‌మాధానం అత‌నికి మంచి రిప్లై ఇచ్చారు అంటూ నెటిజ‌న్లు జొమాటోని మెచ్చుకుంటున్నారు.