మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అంటే వెంటనే చెప్పేది ఎస్బీఐ, మరి తర్వాత స్ధానంలో ఉండేది
దేశీయ రెండో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ , దేశంలో వేలాది బ్రాంచీలు ఉన్నాయి, అంతేకాదు లక్షలాది మంది కస్టమర్లు ఉన్నారు, ముఖ్యంగా అనేక లోన్లు కూడా ఇస్తుంది ఈ బ్యాంక్.
తాజాగా కస్టమర్లకు తీపికబురు అందించింది. మహిళల కోసం ప్రత్యేకంగా పవర్ సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వల్ల మహిళలకు చాలా బెనిఫిట్ ఉంటుంది, అంతేకాదు కావాలి అంటే సెల్ప్ గానే కాదు, మీరు జాయింట్ అకౌంట్ తెరచుకోవచ్చు. కానీ మొదటి పేరు మాత్రం మహిళదే అయి ఉండాలి అని బ్యాంకు స్పష్టం చేసింది.
మరి ఈ అకౌంట్ ఎలా తెరవాలి అంటే
మీరు గ్రామాల్లో ఉంటే అకౌంట్ 500
పట్టణాలు అయితే 1000
నగరాలు మెట్రో సిటీలు అయితే 2000 చెల్లించాలి
ఆధార్ రెండు ఫోటోలు పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది.
మహిళలకు 50 పేజీల చెక్ బుక్ – నెప్ట్ మనీ ట్రాన్స్ఫర్ సర్వీసులు ఫ్రీగా లభిస్తాయి. ఇక ఇందులో అకౌంట్ కలిగిన మహిళలకు ఐదు లక్షల వరకూ ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది.