తెలంగాణలో రేపటి నుంచే ఉద్యోగులకు ఐచ్ఛికాలు

Options for employees in Telangana from tomorrow

0
94

తెలంగాణలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ వేగవంతం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో జిల్లా పోస్టులకు సంబంధించి ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటారు. అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉద్యోగుల విభజన, కేటాయింపులపై సమీక్షించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ లేని జిల్లాల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియ ఊపందుకోనుంది. జిల్లా కేడర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగుల నుంచి రేపు ఐచ్ఛికాలు స్వీకరించనున్నారు. ప్రాధాన్యాల ప్రకారం సీనియార్టీ జాబితాను రూపొందించి ఈనెల 15వ తేదీలోపు కేటాయింపులు పూర్తి చేయాల్సి ఉంది. ప్రొసీడింగ్స్ అందుకున్న వారం రోజుల్లోపు ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంటుంది.

హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగులను 32 కొత్త జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతి జిల్లా కేడర్‌లో 70కి పైగా ఉన్న శాఖల్లో 300 పైచిలుకు కేటగిరీల్లో ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రక్రియలో మూడు లక్షలకు పైగా ఉద్యోగులకు కొత్త కేడర్‌కు శాశ్వతంగా కేటాయించాల్సి ఉంటుంది.