మనం చాలా సార్లు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఒకరు చేసిన ఆర్డర్ను వెయిటర్లు మరొకరికి ఇవ్వడం పొరపాటున అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది సరిచేసుకుని వెంటనే మళ్లీ ఆర్డర్ చేసింది తీసుకువస్తారు..
అమెరికా… న్యూయార్క్లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్లు చేసిన ఓ చిన్న పొరపాటు చివరకు హాస్యాస్పదంగా ముగిసింది.
1300 విలువ కలిగిన వైన్ను ఓ యువ జంట ఆర్డర్ చేసింది.. మరి అదే వైన్ తీసుకురావాలి కదా, కాని రూ.1.47 లక్షలు విలువ కలిగిన వైన్ను సర్వ్ చేశారు, అది తర్వాత తెలిసి షాక్ అయ్యారు, ఈ విషయాన్ని ఆ రెస్టారెంట్ యజమాని తెలిపాడు.
మ్యాన్హట్టన్లోని బ్రాస్సెరీ బ్లాథేజరీ రెస్టారెంట్లో ఓ వ్యాపారవేత్త చౌతు మౌటెన్ రోత్స్ చైల్డ్ అనే ఖరీదైన వైన్ను ఆర్డర్ చేశాడు. అదే సమయంలో ఓ యువ జంట తక్కువ ధర ఉండే పినోట్ నోయర్ వైన్ ఆర్డర్ చేశారు… వారికి డికాంటర్లలో పోసి సర్వ్ చేశారు
అయితే ఇద్దరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు తర్వాత వారికి అది తెలిసింది తప్పు చేశాము అని.
ఇద్దరు కస్టమర్లు హ్యాపీ మూడ్లో ఉండటాన్ని గమనించి తమ సిబ్బంది చేసిన తప్పును చెప్పారు యజమాని… సారీ చెప్పాడు. అది విన్న కస్టమర్లు షాక్ అయ్యారు. అయితే బిల్ విషయంలో సాధారణంగా తీసుకున్నారట ఇద్దరి దగ్గర.