వచ్చే ఎన్నికల్లో కూడా మాదే అధికారం: సీఎం కేసీఆర్

0
94

రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. మేము చేసిన మంచి పనులే మళ్లీ మాకు పట్టం కట్టేలా చేస్తాయి. ప్రజలకు ఏ ప్రభుత్వాన్ని ఉంచాలో బాగా తెలుసు, కొంతమంది అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని అన్నారు. మాకు సర్వేలు ఉన్నాయి. మళ్లీ మా ప్రభుత్వమే కొనసాగుతుంది. మాకు ఆత్మవిశ్వాసం ఉందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.