ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం: మంత్రి హరీష్ రావు

Oxygen supply to every bed: Minister Harish Rao

0
77
Harish Rao

నీలోఫర్ ఆసుపత్రిలో అప్ గ్రేడ్ చేసిన వంద పడకల ఐసీయీ వార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..హైసీయా, నిర్మాణ్ సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయల కల్పనకు ముందుకు రావడం మంచి విషయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం కల్పిస్తున్నదన్నారు. సొంతంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తుందన్నారు.

ముఖ్యమంత్రి వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో 10 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు తెలిపారు. కరోనా మూడో వేవ్ అంచనాల నేపథ్యంలో ప్రత్యేకంగా చిన్నారుల కోసం 5000 పడకలు ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం సీఎం రూ.133 కోట్లు విడుదల చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఈ రమేష్ రెడ్డి, నిలోఫర్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హైసియా ఎండి భరణి, నిర్మాన్, ఇన్ఫోసిస్, ఓపెన్ టెక్స్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిలోఫర్ లో మరో 25 ఐసియు పడకలను 1.75 కోట్లతో ఏర్పాటు చేసేందుకు ఇన్ఫోసిస్, నిర్మాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంత్రి స్పీచ్ పాయింట్స్. హైసియా , నిర్మాన్ సంయుక్తంగా సెకండ్ వేవ్ తరువాత పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతనికి 18 కోట్లు నిధులు అందించారు. 1.10 కోట్లతో ఓపెన్ టెక్ట్స్ నుంచి నిలోఫర్ లో ఐసియు అప్ గ్రేడ్ చేయడం గొప్ప విషయం. మొదటి కార్యక్రమంలో నిలోఫర్ ఆసుపత్రి లోపాల్గొనటం సంతోషంగా ఉంది.

రూ.10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్య శాఖను మరింత వృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తాం. ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలి. కేసీఆర్ కిట్ వచ్చాక గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్ ని 50 శాతానికి పెంచాము. IMR, MMR, NMR మరణాలు గణనీయంగా తగ్గాయి. నగరం 4 వైపులా నాలుగు మెడికల్ టవర్ లు తీసుకురావాలని కృషి చేస్తున్నాము.  వచ్చే ఏడాది నుంచి మరో 8 మెడికల్ కాలేజీలను అందుబాటిలోకి. ప్రతి జిలాలల్లో ఒక మెడికల్ కాలేజి ఉండాలని సంకల్పం.

రూ.33 కోట్లతో నీలొఫర్ లో మరో 800 పడకలు త్వరలో అందుబాటులోకి తెస్తాము. 3వ వేవ్ వస్తే సన్నద్ధంగా ఉండేందుకు రూ. 133 కోట్లు కేటాయించాము. 5000 బెడ్స్ ని చిన్న పిల్లల కోసం సిద్ధంగా ఉంచాము. దేశ సగటు కంటే తెలంగాణ వాక్సినేషన్ లో ముందే ఉంది. వైద్యులు మరింత సమయం కేటాయించాలి. కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యంతో పోటీ పడి పని చేయాలి. వైద్యులు, సిబ్బంది సంక్షేమం ప్రభుత్వం చూసుకుంటుంది. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం.  =అనంతరం జిల్లా ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్ ను నిలోఫర్ ఆసుపత్రిలో ప్రారంభించారు.