కాకరకాయగాళ్లు, గోకరకాయ గాళ్లు : కేసిఆర్ నోట మళ్లీ ఉద్యమ మాటలు

0
108

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చిన నేత పాడి కౌషిక్ రెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ లో సిఎం కేసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి టిఆర్ఎస్ లోకి స్వాగతం పలికారు కేసిఆర్. ఈ సందర్భంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సిఎం. ఉద్యమ కాలంలో వాడిన భాషను మరోసారి ప్రయోగించారు కేసిఆర్. వివరాలు ఆయన మాటల్లోనే చదవండి.

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న కౌశిక్ రెడ్డికి స్వాగతం. నాతో పాటు గులాబీ జెండా ఎగురవేసిన చిరకాల మిత్రుడు సాయినాథ్ రెడ్డికి స్వాగతం. రాష్ట్ర సాధన కోసం చాలా మంది మహానియులు పనిచేశారు. ఉద్యమ పోరాట సమయం కాల్పుల్లో యువత మరణించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆవేదనతో పనిచేసాము. 69 ఉద్యమం విఫలం అయినా… తెలంగాణ పోరాటానికి చాలా నేర్పింది. పిడికిలి మందితో తెలంగాణ వస్తదా అన్నారు ఆనాడు!.

రాజకీయాలు నిరంతర ప్రక్రియ- గెలుపు ఓటములు సహజం. తెలంగాణ కష్టపడి సాధించిన రాష్ట్రం- ఎవ్వరూ అప్పనంగ ఇవ్వలేదు. ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేయొద్దు. శాశ్వతంగా అధికారం ఎవ్వరికీ ఉండదు- ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఎన్టీఆర్ అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అయ్యాను. నాకు మొదటిసారి అసెంబ్లీలో 20 నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంటే…నా వాగ్ధాటితో 80 నిమిషాలు మాట్లాడిన. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నా స్పీచ్ విని స్పీకర్ కౌగిలించుకున్నారు.

రాష్ట్రంలో అమలు అవుతున్న ప్రతి స్కిమ్ వెనుక అనేక ఆలోచనలు ఉన్నాయి. తప్పులు చేసే అధికారం లేదు. మేము అధికారంలో ఉన్నా సరే. గొర్రెల ఉత్పత్తి లో రాజస్థాన్ ను పక్కకు నెట్టి తెలంగాణ నెంబర్ వన్ అయింది. గొర్రెల ఉత్పత్తి- పంపిణీ పై కేంద్ర మంత్రి స్వయంగా చెప్పారు. అన్ని రకాల సంపద ఉన్న తెలంగాణ సమైక్య పాలకుల వల్ల నష్టపోయింది. గతంలో కరెంట్ లేక రైతులు బాయిలకాడ ఆత్మహత్యలు చేసుకున్నారు.  రైతుబంధు లక్ష్యం నెరవేరింది- తెలంగాణ రైతులు ధీమాగా ఉన్నారు.

జోలెడు ఒడ్లు తెచ్చుకునే రైతు- ఇవ్వాళ చాటేడు ఒడ్లు తిరిగి ఇచ్చే స్థాయికి ఎదిగారు. 2వేల 70 మెగా వాట్ల తలసరి విద్యుత్ వినియోగంతో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉంది. కేసీఆర్ కిట్- ధరణి తీసుకురమ్మని ఎవ్వరూ అడగలేదు. పాలన రాదు అన్న ఆంధ్ర ప్రదేశ్ ఇవ్వాళ గల్లంతు అయింది. తెలంగాణ లో పండిన పంటలు ఏపీ కనీసం పోలిక లేదు. హరితహారం చెట్లకింద కేసీఆర్ ఒక్కడే కూర్చొడు కదా.  బొకడా గాడు- చెత్తగాళ్ళు మాట్లాడితే చెల్లుతాయా? రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టమని నన్ను ఎవ్వరూ అడగలేదు.  గోకరకాయ- కాకరకాయ గాళ్ళు చాలా మాట్లాడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఉన్న మున్సిపల్ చైర్మెన్ల సంఖ్యను వెళ్లపై లెక్కపెట్టోచ్చు. తెలంగాణ భవిష్యత్ యువతది. రైతుబంధు పథకం కోసం ఒక్క ఆరు నెలలు తలకాయ కొట్టుకున్నా. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దళితులు అన్యాయానికి గురి అయ్యారు. ఎన్నికలు ఇంకా రెండున్నర ఏళ్లకు వస్తాయి. దళితబంధు పథకం ఎన్నికల స్టెంట్ కాదు. ఏ ఓట్లు ఉన్నాయని ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రక్షణ నిధి పేరుతో ప్రతి జిల్లాకు నిధులు. 10లక్షల రూపాయలు ఒట్టిగ పంచిపెట్టుడు కాదు. ఈ పథకం పై ఓంకర తింకర తిట్టేటోళ్లు చాలా మంది ఉంటారు. కేసీఆర్ ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవ్వరిని తిట్టలేదు. దరఖాస్తు పెట్టుకొని పలానా కులంలో పుట్టాలని అనుకోరు.