పాక్ నుంచి వ‌చ్చిన డ్రోన్ – లోప‌ల ఏముందో చూసి కాల్చేసిన భార‌త ఆర్మీ

పాక్ నుంచి వ‌చ్చిన డ్రోన్ - లోప‌ల ఏముందో చూసి కాల్చేసిన భార‌త ఆర్మీ

0
118
PAK Drone

ఓప‌క్క చైనాతో వివాదం ఘ‌ర్ష‌ణ జ‌రుగుతోంది, మ‌రో ప‌క్క పాక్ కూడా రెచ్చిపోతోంది, ఈ స‌మ‌యంలో ప్ర‌తీ అంశం చ‌ర్చ‌కు వ‌స్తోంది, స‌రిహ‌ద్దుల్లో కూడా గ‌ట్టి భ‌ద్ర‌త అమ‌లు చేస్తున్నారు, తాజాగా భారత బలగాలు పాక్ కుట్రకు ఆదిలోనే అడ్డుకట్ట వేశాయి. డ్రోన్ ద్వారా కశ్మీర్‌లోకి ఆయుధాలు రవాణా చేద్దామనుకున్న పాక్ ప్రయత్నాన్ని బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ అధికారులు భగ్నం చేశారు.

క‌థువా ద‌గ్గ‌ర స‌రిహ‌ద్దు ప్రాంతంలో పాక్ డ్రోన్ కూల్చేశారు మ‌న అధికారులు, ఈ తెల్ల‌వారు జామున సీక్రెట్ గా డ్రోన్ పంపారు.. గస్తీలో ఉన్న అధికారులు గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే దాన్ని పేల్చేశారు. ఈ సందర్భంగా డ్రోన్‌కు అమర్చి ఉన్న ఎమ్-4 ఆటోమేటిక్ రైఫిల్, 60 రౌండ్లు బుల్లెట్లు, రెండు మ్యాగజీన్లు, ఏడు ఎమ్67 గ్రెనేడ్లను వారు స్వాధీనం చేసుకున్నారు.

అయితే దీనిపై భార‌త్ సీరియ‌స్ గా ఉంది, పంజాబ్ సీన్ కశ్మీర్ లో అమ‌లు చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఇలాంటి విష‌యాల‌లో స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి డ్రోన్స్ వ‌స్తే ఊరుకునే ప్ర‌స‌క్తే లేదు అంటున్నారు, ఇది అవ‌త‌ల వైపు నుంచి ఆప‌రేట్ చేసింది అని అంటున్నారు.