అనుకున్నది ఒకటి అయినది ఒకటి – పాక్ కమాండోల బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు

Pakishthan commandos food bill is Rs 27 lakh

0
109

అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అంతా బాగానే ఉంటుంది కానీ ఏదైనా మార్పు జరిగితే దాని ఎఫెక్ట్ మిగిలిన వాటిపై కూడా పడుతుంది. ఇప్పుడు ఈ విషయంలో అందరూ అదే అంటున్నారు.పాకిస్థాన్ లో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది . ఈ సమయంలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తమ పర్యటనలు రద్దు చేసుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది అంటున్నారు క్రికెట్ అనలిస్టులు.

2009లో శ్రీలంక జట్టుపై పాక్ లో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి చాలా దేశాలు పాక్ గడ్డపై క్రికెట్ ఆడేందుకు సుముఖత చూపలేదు. తాజాగా న్యూజిలాండ్ జట్టు సుదీర్ఘ విరామం తర్వాత పాక్ పర్యటనకు వచ్చింది, వన్డే సిరీస్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు ఆ పర్యటన రద్దయింది. అయితే ఈ సమయంలో వీరికి గట్టి భద్రత ఇచ్చేందుకు పాక్ ఏర్పాట్లు చేసింది.

పాక్ పర్యటనకు వచ్చిన సందర్భంగా న్యూజిలాండ్ జట్టు ఇస్లామాబాద్ లోని ఓ హోటల్ లో బస చేసింది. కివీస్ ఆటగాళ్ల భద్రత కోసం పాక్ ప్రభుత్వం 500 మంది కమాండోలను రంగంలోకి దించింది. కేవలం భద్రతా సిబ్బంది బిర్యానీ బిల్లు 27 లక్షలు ఖర్చు అయిందట.పాక్ ప్రభుత్వం ఆ బిల్లులను పెండింగ్ లో ఉంచింది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి కొంత మేర నష్టపరిహారం తీసుకుంటారేమో అని అనలిస్టులు భావిస్తున్నారు.