పాకిస్ధాన్ నుంచి మిడతలు భారత్ వచ్చి ఏం చేస్తున్నాయో చూడండి

పాకిస్ధాన్ నుంచి మిడతలు భారత్ వచ్చి ఏం చేస్తున్నాయో చూడండి

0
97

మిడతల దండు చేసే నష్టం అంతా ఇంతా కాదు, రైతులు గగ్గోలు పెట్టిన పరిస్దితి కూడా ఉంది. పంటలను నాశనం చేయడంలో మిడతలు ముందు ఉంటాయి, చేతికి అంది వచ్చే పంటని గంటల వ్యవధిలో మిడతలు నాశనం చేస్తాయి. పత్తి వరి గోధుమ మొక్కజొన్న పంటలపై వాలి నాశనం చేస్తాయి. అందుకే అనేక మందులు కూడా వాడుతూ ఉంటారు రైతులు.

తాజాగా గుజరాత్ లో రైతులకి పెద్ద చిక్కు వచ్చి పడింది. పాకిస్తాన్ వైపు నుంచి గుజరాత్‌‌కు భారీ మొత్తంలో మిడతలు వస్తున్నాయి. లక్షలాది మిడతలు పంట పొలాలపై పడి నాశనం చేస్తున్నాయి. మిడత కారణంగా ఆవాలు, ఆముదం, సోంపు, జీలకర్ర, పత్తి, ఆలు, గోధుమ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీనిపై రైతులు గగ్గోలు పెడుతున్నారు.

మూడు ఎకరాల పంటకు కేవలం అర ఎకరం మాత్రమే చేతికి వచ్చేలా ఉంది అని అక్కడ ఓ రైతు కన్నీరు పెట్టుకున్నాడు.. రాత్రికి రాత్రి నా పది ఎకరాల పంట నాశనం చేశాయి అని మరో రైతు బోరున విలపించాడు.
రోజు రోజుకూ పెరుగుతున్న మిడతలతో బనస్కాంత, సబర్కాంత, మెహ్సానా, కచ్, పటాన్ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు స్కూలు పిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీని కోసం కేంద్రం నివారణకై 11 టీమ్ లని పంపించింది.