పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్…

పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్...

0
116

కరోనా టెస్టుల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కార్ ఇక వాటికి చెక్ పెట్టే పనిలో పడింది…హైకోర్టు అక్షింతలతో ఆలోచలో పడ్డ సర్కార్ యుద్ద ప్రాతిపదికన టెస్టుల సంఖ్యను పెంచే ఆలోచన చేసింది.. ఇందులో భాగంగా రాష్ట్రంలో 7 లక్షల యాంటీజెన్ టెస్టుల నిర్వహించాలని నిర్ణయించింది….

తొలిదశలో 2లక్షల యాంటీ జెన్ టెస్టు కిట్లు తెప్పించిన టీసర్కార్ వాటితో ఇప్పటికే 65 వేల టెస్టులు నిర్వహించింది… ఆ తర్వాత రెండో దశలో 3 లక్షల కిట్లు తాజాగా మరో 2 లక్షల కిట్లను తెప్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది…

మొత్తం 7లక్షల కిట్లతో రాష్ట్రవ్యాప్తంగా టెస్టులు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది…ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కరోనా టెస్టులు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు…