పాలకొల్లు అంటే సినిమారంగాల వారు చాలా మంది వచ్చిన ప్రాంతంగా చెప్పుకుంటాం, అయితే అలాంటి పాలకొల్లులో రాజకీయ నాయకులు కూడా చాలా మంది కీలక పదవులు చేపట్టారు, అయితే ఇక్కడ ఎన్నడూ లేనంతగా రియల్ భూమ్ వచ్చింది అని చెప్పాలి, తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఎన్నడూ లేని విధంగా గజం భూమి ధర రూ.2.50 లక్షలు పలికింది.
ఈ వార్త విని అందరూ షాక్ అవుతున్నారు.. అసలు హైదరాబాద్ వైజాగ్ అమరావతిలో కూడా ఇంత రేటు ఉండదని కాని ఇక్కడ ఇంత ధర పలకడంతో అందరూ షాక్ అయ్యారు, పంచారామాలలో ఒకటైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఈ స్థలం ఉంటుంది. సాధారణంగా ఆ పట్టణంలో గజం రూ.32 నుంచి 40 వేల మధ్యలో ఉంటుంది. అయితే, ఆలయానికి సమీపంలో ఉన్న స్థలాన్ని ఓ వ్యక్తి గజానికి రూ.2.50 లక్షలు వెచ్చించి సొంతం చేసుకున్నారట.
అయితే మెయిన్ రోడ్ లో గజం లక్షన్నర వరకు ధర పలుకుతుంది అని తెలుసు… కాని ఏకంగా 2.50 లక్షలు పలికింది అని తెలిసి జనం ఆశ్చర్యపోయారు…ఆ వ్యక్తి మొత్తం 200 గజాల స్థలాన్ని కొన్నారు. ఒక భాగంలో గజానికి రూ.1.75 లక్షలు చెల్లించారు. మరో భాగం వంద గజాలకి 2.50 లక్షల చెల్లించారట, ఇది ఓ వ్యాపారవేత్త మరో వ్యాపారవేత్తకి అమ్మారు అని తెలుస్తోంది.. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టనున్నారట, అంతే మరి ఐదు కోట్లు పెట్టి స్థలం కొంటే వ్యాపారాలే చేయాలి అంటున్నారు.