Breaking: పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డితో రేవంత్ భేటీ

0
97

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎట్టకేలకు మునుగోడు బైపోల్ అభ్యర్థిని ప్రకటించింది హైకమాండ్. అయితే అభ్యర్థి ఎంపికలో సీనియర్లు పంతం నెగ్గించుకున్నారు. ముందుగా అభ్యర్థిగా చెలమల కృష్ణారెడ్డి పేరును రేవంత్ సూచించారు. కానీ దీనికి కాంగ్రెస్ సీనియర్ నాయకులూ ససేమిరా అన్నారు. దీనితో అభ్యర్థిగా సీనియర్లు సూచించిన పాల్వాయి స్రవంతికే కేటాయించారు. ఇక తాజాగా ఈ ఇద్దరితో పీసీసీ చీఫ్ రేవంత్ భేటీ అయ్యారు. అసంతృప్తికి గురైన కృష్ణారెడ్డిని పార్టీకి అండగా ఉండాలని రేవంత్ కోరారు.