పాన్ తో ఆధార్ లింకింగ్ గడువు మరోసారి పొడిగింపు ఎప్పటివరకంటే

పాన్ తో ఆధార్ లింకింగ్ గడువు మరోసారి పొడిగింపు ఎప్పటివరకంటే

0
95

నిన్నటి వరకూ పాన్ కార్డుతో మీ ఆధార్ కార్డును లింక్ చేసుకున్నారా, లేదా ? అయితే వెంటనే చేసుకోవాలి అంటూ వార్తలు వినిపించాయి.. లేదంటే మీపాన్ కార్డ్ క్యాన్సిల్ అవుతుంది అన్నారు. ఇక గడువు పెంచరు అని వార్తలు వినిపించాయి.. గతంలో చాలా సార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన కేంద్రం ప్రభుత్వం… ఈసారి డిసెంబర్ 31 తరువాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.

కాని తాజాగా ఈ డేట్ ని మరోసారి పొడిగించింది, ఇది కస్టమర్లకు ఊరట అనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలి అంటే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139ఏఏ ప్రకారం ఇలా లింక్ చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తాము అన్నారు. ఆ గడువు డిసెంబరు 31తో ముగియనుండగా, మరోసారి గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి 31 వరకు తాజా గడువు పొడిగించారు.

అప్పటిలోగా పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు చెల్లదని బోర్డు స్పష్టం చేసింది. సో ఇంకో మూడు నెలల గడుపు పొడిగింపు ఇవ్వడం జరిగింది.. ఇంకా ఎవరైనా చేయని వారు ఉన్నా బ్యాంకుకు కేవైసీ పత్రాలు ఇవ్వని వారు ఉన్నా వాటిని సబ్ మీట్ చేయండి.

ఆ లింక్ ఇస్తున్నాము ..ఇందులో లింక్ చేసుకోవచ్చు.

https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html?lang=eng