పాన్ కార్డ్ తో ఆధార్ అనుసంధానించే గడువు పొడిగింపు

పాన్ కార్డ్ తో ఆధార్ అనుసంధానించే గడువు పొడిగింపు

0
92
పాన్కార్డుతో ఆధార్ను అనుసంధానించే సమయం మార్చి చివరి వరకూ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే చాలా మంది
ఇలా పాన్ ఆధార్ లింక్ చేసుకున్నారు… కొందరు  ఆన్ లైన్ అలాగే మరికొందరు బ్యాంకులో ఈ లింక్ చేసుకున్నారు, అయితే నిన్నటితో ముగిసిన ఈ గడువుని మరోసారి కేంద్రం పెంచింది.
పాన్కార్డుతో ఆధార్ను అనుసంధానించే గడువు తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం  ప్రకటించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో సాంకేతికపరమైన ఇబ్బందుల కారణంగా పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించుకోలేకపోతున్నట్టు ఫిర్యాదులు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, మొత్తానికి సమయం మరోసారి పొడిగించారు.
కరోనా కాలంలో ఈ సమయాన్ని పొడిగించిన విషయం తెలిసిందే.. తాజాగా మరో మూడు నెలలు దీనిని పొడిగించారు.
గతేడాది జులై 31 నుంచి 31 మార్చి 2021 వరకు పొడిగించింది. తాజాగా మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇంకా ఎవరైనా లింక్ చేసుకోవాలి అంటే ఈ వెబ్ సైట్ ద్వారా లింక్ చేసుకోండి.
లింక్ …