పారిపోయిన ప్రేమ జంట ఊర్లో పంచాయతీ – ఏకంగా రాఖీ కట్టించి ఏం చేశారంటే

-

ఇటీవల చాలా ప్రేమ జంటలు ఇంట్లో పెళ్లికి పెద్దలు ఒప్పుకోపోతే పారిపోయి వివాహం చేసుకుంటున్నారు.. తమ దగ్గర ఉన్న డబ్బు బంగారంతో ఎక్కడో  ఓచోట కొన్ని రోజులు కాపురం చేస్తున్నారు… ఇక పెద్దలు వచ్చి వారిని ఇంటికి తీసుకువెళుతున్న ఘటనలు మనం చాలా చూశాం…ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలోని నిజిబాబాద్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల వయసున్న ఓ యువతి యవకుడు ప్రేమించుకున్నారు.
ఇద్దరూ పక్క పక్కన ఇళ్లలో ఉంటున్నారు, ఇక ఇంట్లో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరు అని పారిపోయారు, ఎందుకు అంటే అదే ఊర్లో వారు ఆ ఊరి సంబంధాలు చేసుకోకూడదు అని వేరే ఊరు సంబంధాలు  చేసుకోవాలి అని కట్టుబాటు ఉంది.. దీంతో తమ ప్రేమకి అడ్డు చెబుతారు అని వారు పారిపోయారు.
ఇలా పారిపోతుంటే  హరిద్వార్ సమీపంలో ఉన్న వారిద్దరినీ చూసి పోలీసులకు అనుమానం వచ్చింది… చివరకు  పెద్దలకు సమాచారం ఇచ్చి వారిని అప్పగించారు… ఇక ఊరికి తీసుకువెళ్లి పంచాయతీ పెట్టారు…చెప్పులతో ఇద్దరూ పరస్పరం కొట్టుకోవాలని తీర్పుఇచ్చారు. తర్వాత ఆ అమ్మాయి చేత  యువకుడికి రాఖీ కట్టించారు. ఇక నెల రోజుల పాటు ఆ యువకుడు ఈ ఊర్లో ఉండకూడదు అని వెలివేశారు… దీనిపై పోలీసులకు ఫిర్యాదు వచ్చింది… అక్కడ పెద్ద మనుషులపై పోలీసులు కేసు
నమోదుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...