రాజధాని పేరుతో గత టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీ సాక్షిగా ప్రెజెంటేషన్ వేసి చూపించారు… నారాయణ ప్రత్తిపాటి పుల్లారావు పయ్యావులకేశవ్, అలాగే లోకేశ్ లతో పాటు పరిటాల సునీత కుటుంబం కూడా తమ కుటుంబ సభ్యుల మీద అమరావతిలో భూములు కొన్నారని తెలిపింది…
అయితే దీనిపై గతంలో పరిటాల ఫ్యామిలీ కౌంటర్ ఇచ్చింది అమరావతిలో తమకు సెంటు భూమి ఉంటే అది ప్రభుత్వానికే రాసిస్తామని చేప్పింది… అయితే తాజాగా పరిటాల వర్దంతి సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేశారు కుటింబికులు….
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… తమకు అమరావతి ప్రాంతంలో భుములు ఉన్నాయని అన్నారు… అయితే రాజధాని పరిధలో లేదని స్పష్టం చేశారు.. భవిష్యత్ లో ఉపయోగపడతాయని కొనుగోలు చేశామని తెలిపారు… అందులో తప్పేమి లేదనిఅన్నారు.. ఇది ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదని అన్నారు…