పరిటాల కుటుంబం అంటేనే రాష్ట్ర రాజకీయాల్లో ఓ చరిత్ర అని చెప్పాలి, పరిటాల కుటుంబంలో రవి చేసిన సేవలు ఎవరూ మరువలేరు, అయితే రవి మరణం తర్వాత ఆయన భార్య సునీతమ్మ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, టీడీపీలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు.
అయితే రవి మరణం తర్వాత సునీతమ్మ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంది. సునిత తండ్రి ధర్మవరపు కొండన్న, అయితే ఆయన అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు, దీంతో పరిటాల కుటుంబంలో విషాదం నెలకొంది, కొండన్న మరణంతో అక్కడ గ్రామస్తులు విషాదంలో ఉన్నారు.
టీడీపీ నేతలు సంతాపం తెలిపారు, ఇంతకీ ఆయన ఎవరు అంటే, పేదలకు బాగా సేవ చేసిన వ్యక్తి అంతేకాదు నసనకోట ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్గా కొండన్న సుదీర్ఘకాలం పనిచేశారు, ఈ దేవాలయం మన స్టేట్ లో ప్రసిద్ది, అనంతపురం జిల్లాలో చాలా మంది ఈ దేవాలయానికి వస్తారు, అంతేకాదు ఇక్కడ అభివృద్ది అంతా ఆయనే చేశారు అంటారు స్ధానికులు.