రాజకీయంగా తమకు తిరుగులేదని భావించేవారు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సునామి ముందు కొట్టుకోనిపోయారు. అలాగే వారి వారసుల ఓటమికి కారణం అయ్యారు… గతంలో ఎన్నడు లేని విధంగా టీడీపీ తరపున వారసులను భరిలో దింపారు. కానీ వారు ఎంట్రీలోనే సక్సెస్ కాలేకపోయారు..
మాజీ మంత్రి పరిటాల సునీత వారసుడు పరిటాల శ్రీరామ్ ఈ కోవకే వస్తారని అంటున్నారు… గతంలో వీరు తమకు రాప్తాడు నియోజకవర్గంలో తిరుగులేదని భావించారు. కానీ తోపుదుర్తి ప్రాకాశ్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓటమి చెందారు… ఇక పార్టీ కూడా అధికారం కొల్పోవడంతో కొద్దికాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు పరిటాల ఫ్యామిలీ దూరంగా ఉంది.
ఈ క్రమంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పార్టీ మారడంతో పరిటాల ఫ్యామిలీకి అనుకోని విధంగా కలిసివచ్చింది… ఆ నియోజకవర్గం బాధ్యతలను వీరికే అప్పజెప్పారు చంద్రబాబు.
ఇటీవలే దేవినేని అవినాష్ టీడీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు… ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పడంతో తెలుగు యువ అద్యక్ష పదవి ఖాళీ గా ఉంది… గతంలో శ్రీరామ్ నిర్వహించిన తెలుగు యువత అద్యక్ష పదవిని తిరిగి ఆయనకే ఇవ్వలాని చంద్రబాబు నాయుడు బావిస్తున్నారట… సో మొత్తంమీద చూసినట్లు అయితే ఇటు రాప్తాడు అటు ధర్మవరంతో పాటు తెలుగు యువత అధ్యక్ష పదవి కూడా పరిటాల ఫ్యామిలీకే వరించబోతుంది…