పార్టీ పగ్గాలను ఆయన చేతుల్లో పెట్టేందుకు సిద్దమైన చంద్రబాబు….

పార్టీ పగ్గాలను ఆయన చేతుల్లో పెట్టేందుకు సిద్దమైన చంద్రబాబు....

0
104

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. పార్టీ పగ్గాలను మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు అప్పగించేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అంతేకాదు ఇందుకు సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ చేశారని అంటున్నారు… ఈనెల 27న చంద్రబాబు నాయుడు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి…

ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేత కళా వెంకట్రావు ఉన్నారు… ఇప్పుడు ఆయ స్థానంలో చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడును నియమించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… కాగా ఇటీవలే తెలంగాణ టీడీపీ సీనియర్లు కొందరు చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే….

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ స్థానంలో కొత్తవారిని నియమించాలని కోరుతూ లేఖ రాశారు… మరి తెలంగాణ అధ్యక్షుడు విషయంలో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి… కాగా ఏపీ బాధ్యతలను మరో సారి బీసీ నేతకే అప్పగించాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారు..