పసిడి ధర భగ్గుమంటోంది, ఎక్కడ చూసినా బంగారం ధరలు పెరుగుతున్నాయి కాని తగ్గడం లేదు, తాజాగా బంగారం ధర మళ్లీ పెరిగింది, అంతర్జాతీయంగా బంగారం ధర తగ్గుతున్నా బంగారం మన దేశంలో మాత్రం పెరుగుతోంది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పైకి కదిలింది. దీంతో ధర రూ.52,500కు చేరింది.22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరుగుదలతో రూ.48,150కు చేరింది.
ఇక వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది, ఎక్కడా తగ్గడం లేదు.కేజీ వెండి ధర ఏకంగా రూ.3050 పెరిగింది. దీంతో ధర రూ.62,000కు చేరింది. ఇలా ఆల్ టైం హైకి చేరడంతో వ్యాపారులు కూడా ఆశ్చర్యపోతున్నారు, శ్రావణం సేల్స్ లేకపోయినా బంగారం ఇదే స్ధాయిలో రేటు నడుస్తోంది.