పరుగులు పెట్టిన బంగారం ధర నేడు బంగారం వెండి రేట్లు ఇవే

పరుగులు పెట్టిన బంగారం ధర నేడు బంగారం వెండి రేట్లు ఇవే

0
78

బంగారం ధర చూస్తుంటే కొండెక్కుతోంది.. ధర భారీగా పెరుగుతోంది, ఈ నెల రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి, ముఖ్యంగా వెండి బంగారం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరుగుతోంది. మరి నేడు ఏపీ తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఓసారి చూద్దాం..

 

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో రూ.49,200కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది…రూ.250 పెరుగుదలతో రూ.45,100కు చేరింది.

 

బంగారం ధర పరుగులు పెడితే.. వెండి రేటు మాత్రం నిలకడగానే కొనసాగింది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. వెండి ధర కేజీకి రూ.73,900 కు ట్రేడ్ అవుతోంది. బంగారం వెండి వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ నిపుణులు, మొత్తానికి ట్రేడ్ అనలిస్టులు చెప్పేదాని ప్రకారం కొనుగోళ్లు పెరిగాయి అని ఏప్రిల్ నెలలో చెబుతున్నారు.