పరిస్దితి ఇలాగే ఉంటే రాష్ట్రంలో లాక్ డౌన్ – ముఖ్యమంత్రి కీలక ప్రకటన

పరిస్దితి ఇలాగే ఉంటే రాష్ట్రంలో లాక్ డౌన్ - ముఖ్యమంత్రి కీలక ప్రకటన

0
104

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది …మళ్లీ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి.. రోజుకి 80 వేల కు పైగా కేసులు నమోదు అవుతున్నాయి… ఇక దేశంలో వచ్చే కేసుల్లో దాదాపు సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయి.

దీంతో ఆ రాష్ట్రంలో పరిస్దితి అర్దం చేసుకోవచ్చు…ఇక కచ్చితంగా అక్కడ లాక్ డౌన్ విధిస్తారు అనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి ఇప్పటికే చాలా చోట్ల నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది …వచ్చే రోజుల్లో ఇలాగే కేసులు పెరిగితే లాక్ డౌన్ తప్పదు అంటున్నారు నిపుణులు.

 

లాక్డౌన్ విధించే అవకాశం లేకపోలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలా? లేక ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.ఇక్కడ కేసులు దారుణంగా బయటపడుతున్నాయి చాలా వరకూ మాస్కులు ధరించడం లేదు సామాజికి దూరం పాటించడం లేదు భారీగా కేసులు

అందుకే నమోదు అవుతున్నాయి.

 

పరిస్థితి ఇలాగే కొనసాగితే, 15 రోజుల్లో మౌలిక వసతులు, వనరులన్నీ పూర్తయిపోతాయి. ఇప్పుడు లాక్ డౌన్ విధించడం లేదు కాని దీనిపై మరింత మందితో చర్చిస్తాం, ఇక మరో ప్రత్యామ్నాయం లేదు కేసులు ఇలా పెరిగితే లాక్ డౌన్ తప్పదు అని తెలిపారు

ఇలా ఉంటే మరో రెండు రోజుల్లో కఠిన ఆంక్షలు ప్రకటిస్తారు అని తెలుస్తోంది, శుక్రవారం అత్యధికంగా రాష్ట్రంలో 47,827 కేసులు నమోదు అయ్యాయి, 202 మంది ప్రాణాలు కోల్పోయారు.