ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంతో కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుని ఆర్టీసీ తెలంగాణలో నడుస్తోంది.. అయితే ఇక్కడ చాలా వరకూ కండెక్టర్లు డ్రైవర్లు అనుభవం లేక ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అంతేకాదు పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీకి మరింత నష్టాలు వస్తున్నాయి. అలాగే సర్వీసులు నడువకుండా నడిపాము అని చెప్పిన ఇద్దరిపై కేసు నమోదు అయింది, మొత్తానికి ఇలా అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి .అలాగే ప్రజలకు సరైన సర్వీసు అందడం లేదు. అంతేకాదు కొందరు కండెక్టర్లు టికెట్ కూడా ఇవ్వడం లేదు.
తాజాగా ఓ ప్రయాణికుడు బస్సు ఎక్కాడు, సుమారు 15 రూపాయల టికెట్ ని 25 రూపాయల చార్జ్ వసూలు చేశాడు కండెక్టర్.. దీంతో మరో ప్రయాణికుడి దగ్గరకు వచ్చిన కండెక్టర్ టికెట్ తీసుకోవాలి అని కోరాడు.. దానికి అతను టికెట్ ఒకసారి మాత్రమే తీసుకుంటారు నేను ఆల్రెడీ తీసుకున్నాను అన్నాడు. దీంతో కండెక్టర్ నేను నీకు టికెట్ ఇవ్వలేదు అన్నాడు. నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు టికెట్ మాత్రం ఇవ్వలేదు నేను నీకు ఎలా చూపించాలని ప్రశ్నించాడు.
నేను నీకు 15 రూపాయలు ఇచ్చాను అన్నాడు.. అయితే వీరిద్దరి మధ్య డిస్కషన్ మరింత పెరిగింది, చివరకు కండెక్టర్లు కొందరు టికెట్ ఇవ్వకుండా ఇలా ప్రయాణికుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడంపై ఆ ప్రయాణికుడు తాను ఈపని చేశాను అని చెప్పాడు, ఇలాంటి వారి వల్ల మన ఆర్టీసీని మరిన్ని నష్టాలు అంటూ తెలియచేశాడు ఆ వ్యక్తి.