ముంబయిలో దారుణం జరిగింది ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ ఓ వ్యక్తి ఆమె చుట్టు తిరిగాడు.. ఆమె అతని ప్రేమను తిరస్కరించింది.. ఆమె కుటుంబ సభ్యులు కూడా తాము ఈ పెళ్లి చేయము అని తెలిపారు.. అయినా ఆమెని అతను వదలలేదు.. ఆమెని నిత్యం వేధించాడు… ఇలాంటి సమయంలో ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఆమె దగ్గరకు వెళ్లాడు.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.
ఆమె కాలిపోతున్నా తనపై ఇలా పెట్రోల్ పోసిన వ్యక్తిని గట్టిగా పట్టుకుంది.. దీంతో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి అతని శరీరం కూడా క్షణాల్లో కాలింది.. అతను మంటలతో అక్కడే మరణించాడు.. ఆమెని వెంటనే స్ధానికులు గుర్తించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విజయ్ కాంబేపై పోలీసులు కేసు నమోదు చేశారు, వీరిద్దరికి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉందని తేలింది. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.