ప‌వ‌న్ క‌ల్యాణ్ కు భీమ‌వ‌రం ఎమ్మెల్యే కౌంట‌ర్

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు భీమ‌వ‌రం ఎమ్మెల్యే కౌంట‌ర్

0
81

ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయంగా చేసే విమ‌ర్శ‌లపై వైసీపీ నిత్యం కౌంట‌ర్ వేస్తూనే ఉంటుంది, తాజాగా దిశ ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపాయి. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓట‌మి చెందిన భీమ‌వ‌రం లో, అక్క‌డ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప‌వ‌న్ మాట‌ల‌పై ఫైర్ అయ్యారు.

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడే మాటలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ విమ‌ర్శించారు.అస‌లు తెలిసే మాట్లాడుతున్నావా అని ప్ర‌శ్నించారు. పవన్‌కు మానసిక జబ్బు ఉందని.. దానికి వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచించారు.

అంతేకాదు మ‌న దేశంలో మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఇస్తాం…తల్లులను, స్త్రీలను గౌరవించని వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కేరాఫ్ అడ్రస్ జనసేన పార్టీ అని విమ‌ర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు దరిద్రం పట్టిందనడానికి జనసేన పార్టీ ఓ నిదర్శనం అని విమ‌ర్శించారు. నీ వ్యాఖ్య‌ల‌తో రోజు రోజుకు దిగ‌జారిపోతున్నావు అంటూ ఆయ‌న విమ‌ర్శించారు.