పవన్ కు హీరో సుమన్ ఝలక్

పవన్ కు హీరో సుమన్ ఝలక్

0
90

పవన్ కల్యాణ్ దిశ ఘటనపై చేసిన కామెంట్లు తెలుగు స్టేట్స్ లో పెద్ద ఎత్తున దుమారం రేపాయి, అసలు పవన్ రాజకీయ నాయకుడిగా ఉండి, మరో పక్క అమ్మాయిలకు, మహిళలకు విలువ గౌరవం ఇస్తాను అని చెప్పే పవన్, ఇలాంటి కామెంట్లు చేయడం ఏమిటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఎవరూ మాట్లాడకపోయినా వైసీపీ నేతలు మంత్రులు దీనిపై కామెంట్లు చేశారు.

ఆయన వ్యాఖ్యలు సరిచేసుకోవాలి అని అన్నారు, అయితే పవన్ అత్యాచారం చేసిన నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అని అన్నారు, దీంతో తాజాగా ప్రముఖ సీనియర్ హీరో సుమన్ కూడా వీటికి ఖండించారు. పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అని ఆయన తెలియచేశారు.

అలాంటి ఘటనలు వారి ఇంట్లో జరిగితే ఇలానే మాట్లాడతారా? అని ప్రశ్నించారు. బాధితుల ఆవేదనను అర్థం చేసుకుని మాట్లాడాలని సూచించారు.ఇంత దారుణంగా ఆమెకు అన్యాయం జరిగిందని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటే దుర్మార్గులకు కఠిన శిక్ష విధించాలన్నారు సుమన్..
అయితే ఎంత మంది దీనిపై విమర్శలు చేస్తున్నా పవన్ మాత్రం పెద్ద పట్టించుకోవడం లేదు, తన కామెంట్లను వెనక్కి తీసుకోవడం లేదు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.