పవన్ లో ఇంత మార్పా….

పవన్ లో ఇంత మార్పా....

0
90

సౌత్ ఇండియా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఆయన సినిమాకు సంబంధించిన అప్ డేట్స్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో ఫక్షన్ సినిమా రిలీజ్ ఇలా ఏదైనా సరే అభిమానులు పండగా చేసుకుంటారు… తమ అభిమానాన్ని చూటుకుంటారు..ఇక ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే ఆరోజు పవన్ అభిమానులకు పెద్ద పండగే అంటారు….

కటౌట్స్ ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు… అయితే ఇటీవలే బర్త్ డే సందర్భంగా పవన్ లో భారీ మార్పు వచ్చిందని అంటున్నారు కొందరు… పవన్ కు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చాలామంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు… శుభాకాంక్షలు చెప్పిన ప్రతీ ఒక్కరికి పవన్ ధన్యవాదలు తెలిపారు…

పొలిటికల్ లీడర్లకు అలాగే సినీ ఇండస్ట్రీకి చెందని స్టార్ హీరోల నుంచి చిన్న హీరోలవరకు అందరికీ పవన్ స్వయంగా రిప్లై ఇచ్చారు… అందరికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ ఇలా రిప్లై ఇవ్వడం చూసి వారు ఆశ్చర్యపోతున్నారట… సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో పొలిటికల్ లీడర్ అయిన పవన్ ఇలా అందరికీ రిప్లై ఇవ్వడం చాలా నచ్చిందట…