జనసేనలో ముసలం

జనసేనలో ముసలం

0
85

జనసేన పార్ట అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే… పున్నమిఘాట్ లో మత మార్పి జరుగుతుందని పవన్ వ్యాఖ్యానించారు… దీనిపై ఆ పార్టీ రాష్ట్ర క్రైస్తవుల సంఘటం నేత అలివర్ రాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని అన్నారు… పవన్ అన్న మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని గతంలో డిమాండ్ చేశామని అన్నారు… కానీ ఆయన వెనక్కి తీసుకోలేదని అలివర్ రాయ్ తెలిపారు…

అంతేకాదు పవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు… అందుకే తాము పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు… అలాగే పవన్ పై చర్యలు తీసుకోవాలని కమీషనర్ కు కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు… మొత్తానికి పవన్ వైఖరి వల్ల ఆ పార్టీలో ముసలానికి దారి తీసిందని చెప్పాలి..