మరో పోరాటానికి సిద్దమైన పవన్

మరో పోరాటానికి సిద్దమైన పవన్

0
94

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్దమయ్యారు… విశాఖ జిల్లాలో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే… ఇదే క్రమంలో కాకినాడ వేధికగా మరో పోరాటం చేయనున్నారు పవన్…

నెల 12న రైతులకు మద్దతుగా తాను నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వానికి హెచ్చరించారు … తాజాగా రాజమండ్రి రైతు సధస్సులో పాల్గొన్న పవన్ ఈ ప్రాంత్రంలో 100 మంది రైతుల్లో 60మంది కౌలు రైతులే ఉన్నారని అన్నారు….

కొందరు రైతులు ధాన్యం విక్రయించి 45 రోజులు గడుస్తున్నా వారికి డబ్బులు ఇవ్వలేదని పవన్ ఆరోపించారు… వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం నిల్వ చేసిన రైతులకు రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు… ప్రభుత్వం దీనిపై స్పందించకపోతే తాను నిరాహార దీక్ష చేస్తానని స్పష్టం చేశారు…