ఏపీలో పవన్ బిగ్ ప్లాన్…

ఏపీలో పవన్ బిగ్ ప్లాన్...

0
85

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్ వేశారు… రానున్న మరికొద్దిరోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది.. ఈ ప్రచారం నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీలను ప్రకటించినట్లు తెలుస్తోంది….

పంచాయితీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది జనసేన పార్టీ… అందులో భాగంగానే తాజాగా 5 సంయుక్త పార్లమెంటరీ కమిటీలను నియమించింది… రాష్ట్ర వ్యాప్తంగా 25లోక్ సభ స్థానాలు ఉంటే జనసేన పార్టీ కేవలం 5 సంయక్త పార్లమెంటరీ కమిటీలను నియమించింది..

అందులో ఒకటి ఉత్తరాంధ్ర సంయుక్త కమిటీ, గోదావరి సంయుక్త కమిటీ సెంట్రల్ ఆంధ్ర సంయుక్త కమిటీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త కమిటీ ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి.