పవన్ బీజేపీతో కలయికపై జగన్ సర్కార్ క్లారిటీ…

పవన్ బీజేపీతో కలయికపై జగన్ సర్కార్ క్లారిటీ...

0
97

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే… దీనిపై ఏపీ సర్కార్ స్పందించింది…. పవన్ కళ్యాణ్ స్థిరత్వం లేని వ్యక్తి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీతో పొత్తుకూడా గ్యారంటీ లేదని అన్నారు… గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో ఇప్పుడు అదే బాటలో పవన్ కళ్యాణ్ కుడా నడుస్తున్నారని అంబటి ఆరోపించారు…

ప్రత్యేక హోదా గురించి ఆ పార్టీని నిలదీయాల్సిందిపోయి ఆ పార్టీతోనే చేతులు కలుపుతారా అని ప్రశ్నించారు… గతంలో పాచిపోయాన లడ్డులు ఇచ్చారన్న పవన్ కు ఇప్పుడు అదే పార్టీ నాయకులు కొత్త లడ్డులు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు…