పవన్ బీజేపీతో పొత్తుకు ఆ నేత కీలక పాత్ర

పవన్ బీజేపీతో పొత్తుకు ఆ నేత కీలక పాత్ర

0
92

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ఏపీకి బీజేపీ ఏం చేసిందని పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

పవన్ బీజేపీతో పొత్తుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రే అని ఆరోపించారు… రాజకీయాల్లో నిలకడలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని అన్నారు… బీజేపీలో కూడా పవన్ నిలకడగా ఉండలేరని తన జ్యోస్యం చెప్పారు …

గాజువాక భీమవరంలో పోటీ చేసినా కూడా గెలవలేకపోయారని అవంతి ఆరోపించారు… కాగా తాజాగా పవన్ బీజేపీతో బేషరతుగా పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే…. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తామని అన్నారు పవన్…