పవన్, చంద్రబాబుల పరువు తీసిన రోజా

పవన్, చంద్రబాబుల పరువు తీసిన రోజా

0
90

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లపై వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు…

అయితే దీన్ని చంద్రబాబు నాయుడు పవన్ లు రాద్దాంతం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు… ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను జగన్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నందున పక్క రాష్ట్రాల ప్రజలు కూడా జగన్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు…

ఈ ఎన్నికల్లో ఓటమి పాలు అయిన చంద్రబాబు నాయుడు చిన్నమెదడు చిట్లిందని అన్నారు… గతంలో చేసిన తప్పుల కారణంగా ఈ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయిని అన్నారు… కరకట్ట వద్ద ఇంటిని కూల్చేయాలని కోర్టు చెప్పినా కూడా సిగ్గులేకుండా అక్కడే ఉన్నారని రోజా మండిపడ్డారు…