జగన్ పై పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

జగన్ పై పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

0
98

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యాభోదన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే…

దీనికి ప్రతిపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి… తాజాగా ఇదే అంశంపై మరోసారి పవన్ విమర్శలు చేశారు… తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ.. తెలుగు మీడియాను నడుపుతూ… తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సుచిస్తొందంటూ పవన్ విమర్శించారు…

వైసీపీ నాయకులు మాతృ భాషను మృత బాషగా మారనివ్వకండని పవన్ సూచించారు… మా తెలుగు తల్లికి అని పాడాల్సిన మీరు తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు…