ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైమరోసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ముఖ్యంగా రాయలసీమ ప్రస్తావనను తీసుకువచ్చారు… సీమపై 1996లో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ప్రచురించిన పుస్తకాన్ని పవన్ పోస్ట్ చేశారు… మానవ హాక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయలసీమలోనే అని పేర్కొన్నారు..
1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుందని అన్నారు…
అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రస్తావన కూడా ఉంటుందని పన్ పేర్కొన్నారు… మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది ‘ రాయల సీమ లోనే… కర్నూలులోని ఒక రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని ,14 ఏళ్ల ‘సుగాలి ప్రీతి ‘ ఉదంతమే దానికి ఉదాహరణ తెలిపారు పవన్..