తాజాగా మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి జాతీయ విద్య మైనార్టీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జగన్ హాజరు అయ్యారు… ఈ కార్యక్రమంలో జగన్ పవన్ ను టార్గెట్ చేశారు… ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని పవన్ తన అభ్యంతరం వ్యక్తం చేశారిన అన్నారు…
అయ్యా పవన్ కళ్యాణ్ మీకు ముగ్గురు భార్యలు బహుషా నలుగురో ఐదుమందో పిల్లలు వాళ్లందరినీ ఏ మీడియంలో చదివి పిస్తున్నారని జగన్ ప్రశ్నించారు… దీనిపై జనసేన రీ కౌంటర్ ఇచ్చింది… వ్యక్తిగత విమర్శలు చేస్తున్న జగన్ కి గతంలో పవన్ కళ్యాన్ కౌంటర్ ఇచ్చిన వీడియోను తాజాగా పోస్ట్ చేశారు…
అందులో భాగంగా పవన్ మాట్లాడుతూ… నా మూడు పెళ్లిళ్లవల్లే రాష్ట్ర విభజన జరిగిందా. నా మూడు పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా నా మూడు పెళ్లిళ్ల వల్లే మీరు అవినీతి కేసులో జైలుకు వెళ్లారా అని తమషాగా ఉందా అని పవన్ ప్రశ్నించిన వీడియోను పోస్ట్ చేశారు… మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్ప కూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వల్లే అంట జగన్ నిజమేనా అని ట్వీట్ చేశారు.