ఏపీలో అన్నదాతల మరణంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంటలు పండించిన తర్వాత నష్టాలు రావడంతో అప్పుల తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం అని పేర్కొన్నారు. రైతుల,కౌలు రైతుల బాధను ప్రభుత్వం పట్టించు కోవడం లేదని తెలిపారు.
ప్రతి కౌలురైతు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు. ఈ మేరకు పవన్ వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. అందుకే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామ”ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు కొంతైనా అండగా ఉండాలని జనసేనా పార్టీ నిర్ణయించిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్నీ త్వరలోనే పరామర్శిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పటికీ రైతులు, కౌలు రైతుల పక్షాన నిలుస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.