పవన్ ఫార్ములా సక్సెస్ అయ్యేనా….

పవన్ ఫార్ములా సక్సెస్ అయ్యేనా....

0
84

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు… ఇటీవలే బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే…. నిత్యం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలుస్తూ వారి తరపున గళం విప్పుతున్నారు…

ఇక మరో వైపు తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చారు… బాలీవుండ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీలో నటిస్తున్నారు పవన్… ఒక వైపు సినిమా మరో వైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్… అయితే కార్యకర్తలతో మాట్లాడాలన్నా దేనిపైనా మాట్లాడాలన్నా కర్నూల్ లేదంటే అమరావతికి వెళ్లాల్సి వస్తోంది…

అక్కడకు వెళ్లాలంటే కనీసం 6 గంటలు జెర్నీ చేయాల్సి ఉంటుంది.. దీంతో షూటింగ్ లకు ఇబ్బంది గా మారుతుంది… అందుకే పవన్ ఏపీకి సంబంధించిన వ్యవహారాలను హైదరాబాద్ నుండే చూసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… అంతేకాదు త్వరలోనే ఇందుకు సంబధించి ఒక ప్రకటన కూడా రాబోతుందని చర్చించుకుంటున్నారు…