పవన్ కల్యాణ్ పోటీ చేసిన గాజువాక భీమవరం రెండు సెగ్మెంట్లలో ఇప్పుడు జనసేన కేడర్ కు కేవలం పవన్ మాత్రమే ఉన్నారు.. అయితే అక్కడ పార్టీ తరపున మరో ప్రత్యామ్నాయ నాయకుడిని కూడా చూడాలి అలి పిలుపు వస్తోంది.. అయితే పవన్ ఇప్పటికే భీమవరం సెలక్ట్ చేసుకుని వచ్చే ఏడాది నుంచి అక్కడ రాజకీయంగా ఉండనున్నారు.. వైసీపీ పై పోరాటం చేయాలి అని చూస్తున్నారు.. అక్కడ ఉండి స్ధానిక సమస్యలపై పోరాటం చేయాలని చూస్తున్నారు.
అయితే గాజువాక ప్లేస్ లో మరి ఎవరు ఉంటారు అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం.. ఇక్కడ కూడా జనసేనకు ఎవరో ఓ నాయకుడిని సెలక్ట్ చేయాలని కోరుతున్నారు, ఇక పవన్ కల్యాణ్ కూడా ఇక్కడ పార్టీ కోసం కష్టపడిన నేతకు బాధ్యత ఇవ్వాలి అని చూస్తున్నారట.