ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఒక సలహా ఇచ్చారు…. ఏపీ రాజధానిని పులివెందులకు మార్చుకుంటే బెటర్ అని అన్నారు…
దీంతోపాటు కోర్టును కూడా కర్నూల్ జిల్లాకు మార్చితే ఆయన ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టుకు హజరు అయ్యేందుకు సులువుగా అవుతుందని అన్నారు… అలాగే ఖర్చు కూడా తక్కువ అవుతుంది అన్నారు…
తాజాగా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా జనసేన పార్టీనేతలతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు… ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…. వైసీపీ ప్రభుత్వం అన్నిరకాలుగా వైఫల్యం చెందుతుందని అన్నారు… అంతేకాదు త్వరలో ఇసుక సమస్యలను తీర్చకుంటే తాను ప్రత్యక్ష ఆందోళన చేస్తానని స్పష్టం చేశారు…