జగన్ కు అభినందనలు…. పవన్ రీజన్ అదే

జగన్ కు అభినందనలు.... పవన్ రీజన్ అదే

0
79

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… జగన్ కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు… దీనిపై స్పందించిన జగన్… సుగాలి ప్రీతికి తప్పక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు..

అంతేకాదు ఈ కేసు సీబీఐకి అప్పగించారు… దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు… ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం అని అన్నారు… సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యం జరిగిందని అన్నారు…

సీబీఐ విచారణ ద్వారా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు… కాగా 2017లో కర్నూల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న సుగాలి ప్రీతి అనుమాస్పద స్థితిలో చనిపోయింది… అయితే పోస్ట్ మార్టం రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు తేలడంతో సుగాలి ప్రీతి స్కూల్ యజమానిపై యజమాని కొడుకుపై ఫిర్యాదు చేశారు…

పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన 23 రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చారు… దీనిపై ప్రీతి కుటుంబసభ్యులు న్యాయ పోరటం చేస్తూనే ఉన్నారు… తాజాగా ఈ కేసును జగన్ సీబీఐకి అప్పగించారు…