జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే రాజధాని రైతులమీద పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే దీని పై పవన్ స్పందించారు…
426 మంది రైతులపై కేసులు పెట్టడం ద్వారా ప్రభుత్వం వారిని భయబ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను పంపిణీ చేస్తుంటే వారు అడ్డుకున్నారని వాళ్ల భవిష్యత్ కు భరోసా లేనందుకు నిరసన వ్యక్తం చేస్తే కేసులు నమోదు చేయడం దారుణం అని ఆరోపించారు…
రైతులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉప సంహరించుకోవాలని పవన్ డిమాండ్ చేశారు… మరోవైపు ఆయన అమర సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం గతంలో ప్రకటించిన కోటి విరాళాన్ని తాజాగా ఢిల్లీకి వెళ్లి కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయంలో అందజేశారు…