జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి హస్తినకు బయలుదేరారు… తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్ మెంట్ కన్ఫామ్ కావడంతో పవన్ ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది…
అమిత్ షాతో పాటు పలువురు జాతీయ నాయకులను కూడా పవన్ కలిసే అవకాశాలు ఉన్నారు… ప్రస్తుత ఆంద్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై పవన్ కేంద్ర నాయకులతో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి…
ముఖ్యంగా వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు అక్రమ కేసులతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బీజేపీ పొత్తులపై చర్చించే అవకాశాలు ఉన్నాయి… ప్రస్తుతం పవన్ హస్తిన పర్యటన రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది…