కిన్నెర కళాకారుడు మొగులయ్యకి పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం

Pawan Kalyan financel helpd to Kinnera artist Mogulaiah

0
114

ఇప్పుడు ఎక్కడ వింటున్నా భీమ్లా నాయక్ పాట వినిపిస్తోంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఇటీవల విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అభిమానులకి ఈ సాంగ్ బాగా నచ్చింది. ఈ పాటలో మొదట వచ్చే పరిచయ వాక్యాలను కిన్నెర కళాకారుడు మొగులయ్య ఆలపించారు. కిన్నెర వాయిద్యాన్ని రమ్యంగా మీటుతూ బాగా పాడారు ఇది అందరికి నచ్చింది. సాంగ్ కి కూడా మరింత ఆకట్టుకునేలా ఈ మాటలు ఉన్నాయి.

భీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలను పరిచయం చేశారాయన .మొగులయ్య వంటి జానపద కళాకారులపై పవన్ కల్యాణ్ కు మొదటి నుంచి అభిమానం ఉంది. తాజాగా ఆయనకు రూ.2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. తాను స్థాపించిన పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ ద్వారా ఈ ఆర్థికసాయం అందించనున్నారు.

త్వరలోనే ఆయనకు చెక్ అందించనున్నారట .తెలంగాణలోని ఆమ్రాబాద్ రిజర్వ్ అటవీప్రాంతం ఆయన సొంత ప్రాంతం. ఇక
ప్రత్యేకంగా 12 మెట్ల కిన్నెర వాయిద్యాన్ని రూపొందించి దీని ద్వారా అద్భుత స్వరాలు పలికిస్తాడు. పవన్ చేసిన పనికి అందరూ ప్రశంసిస్తున్నారు.