జగన్ కు షాక్… చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్

జగన్ కు షాక్... చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్

0
112

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దికాలంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి విధితమే. ఇటీవలే ఆయన వందరోజుల పరిపాలన గురించి కూడా పవన్ ప్రస్తావించారు…

అలాగే ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ సర్కార్ గురించి 9 అంశాలను ప్రస్తావించారు… ఇదే క్రమంలో ప్రశ్నా పత్రం లీకేజ్ పై కూడా పవన్ స్పందించారు… ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఇటీవలే జరిగిన గ్రామసచివలాయ పరీక్ష పత్రం లీక్ అయిందని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే…

వీరు చేస్తున్న విమర్శలకు వైసీపీ సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు…. ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పరిక్ష పేపర్ లీక్ అవ్వలేదని అయ్యే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు. మరి ఇలాంటి సందర్భంలో పవన్ టీడీపీ చేస్తున్న ఆరోపణలకు సబంధించిన ఆధారాలు ఉన్నాయా అని అడగకుండా పవన్ వారికి మద్దతు ఇచ్చినట్లుగా ఉందని రాజకీయ మేధావులు అంటున్నారు.