జగన్ చేసిన అతి పెద్ద మోసాన్ని బట్టబయలు చేసిన పవన్

జగన్ చేసిన అతి పెద్ద మోసాన్ని బట్టబయలు చేసిన పవన్

0
89

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బయట పెట్టారు… ఎన్నికల ప్రచారంలో జగన్ రైతులకు ఇచ్చిన హామీ ఒకటని ఇప్పుడు అమలు చేస్తుంది మరోకటని పవన్ ప్రశ్నించారు…

వైసీపీ మెనిఫెస్టోలో ప్రతీ సంవత్సరం పెట్టుబడి సహాయం కింద ప్రతీ రైతుకు 12500 ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు… కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట తప్పారని పవన్ మండిపడ్డారు… రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన 12500 రూపాయాలు అలాగే కేంద్ర ప్రకటించిన 6000 రూపాయలు ఈ రెండు కలిపితే 18500 అవుతుందని అన్నారు..

అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన 6వేలతో కలిపి 13500 రూపాయలు మాత్రమే రైతులకు ఇస్తుందని పవన్ ఆరోపించారు… వెంటనే 18500 రూపాయలు రైతులు అకౌంట్లలో జమచేయాలని పవన్ డిమాండ్ చేశారు