పవన్ లాంగ్ మార్చ్ వాయిదా… కారణం అదేనా

పవన్ లాంగ్ మార్చ్ వాయిదా... కారణం అదేనా

0
100

అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలు కలిసి ఫిబ్రవరి రెండున పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే…

అయితే ఈ లాంగ్ మార్చ్ ను వాయిదా వేశారు.. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు… బీజేపీ నేత నాగభూషణం మాట్లాడుతూ జనసేన పార్టీ బీజేపీ అధ్వర్యంలో నిర్వహించబోయే లాంగ్ మార్చ్ ను వాయిదా వేస్తున్నామని తెలిపారు…

త్వరలోనే కార్యచరణ గురించి ప్రకటిస్తామని తెలిపారు… కాగా ఇటీవలే పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరిలు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే… భేటీలో మూడు రాజధానులపై అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించారు… అలాగే అభివృద్ది కార్యక్రమాలపైన కూడా చర్చించారు..