జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ స్ధాపించి 2014 లో ఆయన బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఈ సమయంలో ఆయన పోటీ చేయలేదు, ఇక 2019 ఎన్నికల్లో ఆయన కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశారు, అయితే రాజోలు మినహా ఆయన పార్టీ గెలిచింది ఎక్కడా లేదు.
ఇక ఆయన పోటీ చేసిన గాజువాక, భీమవరం లో ఆయన ఓటమి పాలయ్యారు, కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట పోటీ చేసినా ఆయన ఓటమి పాలయ్యారు, తాజాగా పవన్ 2024 కి మరో కొత్త సెగ్మెంట్ పై ఫోకస్ చేశారు అని తెలుస్తోంది.
ఇవన్నీ కాదని ఆయన సొంత ఊరు మొగల్తూరు ఉన్న నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి, ఇక ఇక్కడ నుంచి వైసీపీ తరపున ప్రసాద్ రాజు గెలిచారు, ఇటు తెలుగుదేశం కంటే ఇక్కడ జనసేన పార్టీ రెండోస్ధానంలో నిలిచింది… అందుకే ఇక్కడ జనసేన పవర్ బాగుంది అని ఇక్కడ పార్టీ పటిష్టంగా ఉంది అని అంటున్నారు, అందుకే ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే బాగుంటుంది అంటున్నారు నాయకులు.