పరువునష్టం దావా వేస్తున్న పవన్ కల్యాణ్

పరువునష్టం దావా వేస్తున్న పవన్ కల్యాణ్

0
90
Pawan Kalyan

ఏపీ రాజధాని ప్రాంతంలో తమకు న్యాయం జరగాలి అని కోరుతున్నారు రైతులు.. అమరావతిని రాజధానిగా ఉంచాలి అని అంటున్నారు.. రాజధానిని విశాఖకు తరలించద్దు అని నిరసనలు పెరుగుతున్నాయి, ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ దిశగానే ముందుకు వెళుతోంది, అయితే ఇక్కడ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తోంది.

అంతేకాదు ఆధారాలతో సహా ఎవరు ఏ నాయకుడు ఇక్కడ రైతుల నుంచి భూములు చౌకగా కొన్నారు అనేది కూడా చెబుతున్నారు, అసెంబ్లీలో లైవ్ లో వారి పేర్లను కూడా చదివి వినిపించారు మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి. రెండు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అమరావతి ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు 62 ఎకరాల మేర భూములు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన వర్గాలు మండిపడ్డాయి.

అసలు రాజధాని ప్రాంతంలో పవన్ కల్యాణ్ కు భూములు లేవని కావాలనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్నారు జనసేన నాయకులు.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తున్నామని జనసేన పార్టీ న్యాయవిభాగం వెల్లడించింది.ఈ ప్రచారానికి కారకులైన వారికి లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు